NTV Telugu Site icon

MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు

Derek O'brien

Derek O'brien

ఈ నెల ప్రారంభంలో లోక్‌సభ సమావేశాల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా అక్కడి నుంచి దూకి ఎంపీల మధ్యకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ‘లోతైన, చీకటి గది’గా మారిందని, భద్రతా ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.

2001లో పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు మూడు రోజుల పాటు పార్లమెంట్‌లో బహిరంగ చర్చ జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో ఓబ్రెయిన్ తెలిపారు. అప్పటి ప్రధాని, హోంమంత్రి.. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కాగా.. ఈ ఏడాది జరిగిన దాడులను చూస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. హోంమంత్రి తమ ప్రకటనను డిమాండ్ చేయడంతో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. నేడు పార్లమెంట్ లోతైన, చీకటి గదిగా మారిందని తెలిపారు.

Read Also: Mohan Yadav: యూపీ సీఎంను ఫాలో అవుతున్న మధ్యప్రదేశ్ సీఎం.. బుల్డోజర్కు పనిచెప్పిన మోహన్ యాదవ్

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ డిసెంబర్ 13న లక్నో నివాసి సాగర్ శర్మ, మైసూర్ నివాసి డి.మనోరంజన్ బూట్లలో దాచుకున్న రంగు గొట్టాలతో పార్లమెంటులోకి ప్రవేశించి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. లోక్‌సభ సందర్శకుల గ్యాలరీ నుండి సభలోకి దూకిన వ్యక్తికి సింహా కార్యాలయం పాస్‌లు జారీ చేసిందని, ఇది రాజకీయ వివాదానికి దారితీసిందని.. శీతాకాల సమావేశాల కోసం 143 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేశారని ఆ తర్వాత బయటపడింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రతిపక్ష ఎంపీలు.. భద్రతా ఉల్లంఘనపై చర్చ జరగాలని, హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంపీలు తమ డిమాండ్లను సభలో పెద్దఎత్తున లేవనెత్తడంతో సభా కార్యక్రమాలను పదే పదే వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే క్రమశిక్షణా రాహిత్యంతో లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 46 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.