Site icon NTV Telugu

Daggubati Purandeswari: పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం!

Daggubati Purandeswari

Daggubati Purandeswari

దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం అని బీజేపీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. భారతదేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో పేదరికం ఐదు శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో.. దానికి జవాబుదారీతనంగా పరిపాలన ఉందన్నారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి నేడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు.

Also Read: Kondapalli Municipal Election: ఎక్స్ అఫిషియో ఓటు ఓకే.. కొండపల్లి చైర్మన్ పీఠం టీడీపీదే!

‘ఎన్డీయే కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో.. దానికి జవాబుదారీతనంగా పరిపాలన సాగుతోంది. 11 సంవత్సరాలు వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట. డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకున్న కారణంగా అవినీతి రహిత పాలన అందించాం. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేసుకొని.. జర్మనీని అధిక మించి ప్రపంచ స్థాయిలో 4వ స్థానంలోకి వెళ్లాము. త్వరలో జపాన్‌ను దాటి మూడోవ స్థానంలోకి చేరడానికి ప్రయత్నం చేస్తున్నం. ప్రధాని మోడీ పాలనపై ప్రతి ఏడాది లాగే ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నాం. దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యం. 11 ఏళ్లలో అవినీతి జరిగిందని ప్రధాని మోడీ వేలెత్తి చూపించుకోలేదు. భారతదేశంలో 80 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నాము. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో పేదరికం ఐదు శాతం తగ్గింది’ అని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.

Exit mobile version