Madhya Pradesh : ప్రముఖ యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ భూపేంద్ర జోగి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణం నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో భూపేంద్ర జోగికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రముఖ యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ భూపేంద్ర జోగి భోపాల్‌లోని న్యూ మార్కెట్‌లో బట్టల దుకాణాన్ని నడుపుతున్నారు. అతను తన ఇంటి నుండి ప్రతిరోజూ అదే మార్గంలో వస్తాడు. మంగళవారం దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా రోషన్‌పుర సమీపంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జరిగింది.
Read Also:Peddapalli Campaign: పెద్దపల్లిలో వింత ప్రచారం.. ఓటర్ల కాళ్లు పట్టుకున్న అభ్యర్థి
దాడి తర్వాత భూపేంద్ర జోగి తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు. దీంతో అటుగా వెళ్తున్న కొందరు బాటసారులు భూపేంద్రను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భూపేంద్ర వీపుపై, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు తనపై దాడి చేసినప్పుడు తనను తాను రక్షించుకోవడానికి చేతులు ముందుకు పెట్టుకున్నానని… దీంతో అతని చేతికి కూడా గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో భూపేంద్ర జోగికి దాదాపు 40 కుట్లు పడ్డాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చేరారు. అతని కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గుర్తుతెలియని దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూపేంద్రకు ఎవరితోనూ శత్రుత్వం లేదని ఆయన కుటుంబం చెబుతోంది. గత సంవత్సరం సోషల్ మీడియా ఇంటర్వ్యూలో భూపేంద్ర జోగి ‘నామ్ క్యా హై? భూపేంద్ర జోగి తన డైలాగ్‌తో వైరల్‌గా మారాడు. అతనిపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి.
Read Also:Manushi Chhillar : హాట్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న మానుషి..