NTV Telugu Site icon

Bandi Sanjay: రజాకార్ సినిమా చూసిన ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ కూడా చూసి..!

Bandi Sanjay

Bandi Sanjay

కరీంనగర్లోని మమత థియేటర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘రజాకార్’’ సినిమాను వీక్షించారు. ‘‘రజాకార్’’ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి, డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినీ నటులు రాజ్ అర్జున్ (మెయిన్ యాక్టర్), బలగం సంజయ్, గిరి, కాస్ట్యూమ్ డిజైనర్ పూజ(కరీంనగర్) తదితరులు సైతం ఈరోజు బండి సంజయ్ తో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొంతమంది కూహన సెక్యులర్ వాదులు తెలంగాణ చరిత్రని మరుగున పెట్టారని ఆరోపించారు. నిజామే గొప్పవాడని కీర్తిస్తున్నారని తెలిపారు. నిజమైన చరిత్రని సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో తీసిన సినిమా రజాకార్ అని అన్నారు.

Shamshabad Airport: సీఎం వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గంట నుంచి అందులోనే..!

కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి… అని కోరుతున్నాను. కేసీఆర్ ఒక్కసారి ఈ రజాకార్ సినిమా చూసి నిజాం మంచోడు అని ట్వీట్ చేయాలని బండి సంజయ్ తెలిపారు. నిజాం సమాధి వద్ద మోకరిల్లావు కదా కేసీఆర్.. ఒక్కసారి ఈ సినిమా చూడాలని పేర్కొన్నారు. రజాకార్ వారసత్వ పార్టీ ఎంఐఎంతో కలిసిన వాళ్ళు కేసీఆర్, కాంగ్రెస్ అని విమర్శించారు. చార్మినార్ వద్ద ఈ సినిమా ప్రదర్శించి.. ఒవైసీ బ్రదర్స్ని కట్టేసి ఈ సినిమా చూపెట్టాలని అన్నారు. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల మాదిరిగా రజాకార్ ఫైల్స్ తీయాలని గూడూరు నారాయణరెడ్డి సంకల్పించారన్నారు. అప్పటి ప్రభుత్వం అడ్డంకులు పెట్టినా సినిమాను ఆపలేదని బండి సంజయ్ తెలిపారు.

Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్‌బోర్డ్..

నిజాం కాలంలో జరిగిన అకృత్యాలు, విధ్వంసం నేటి తరానికి చెప్పేదే రజాకార్ సినిమా అని అన్నారు. భవిష్యత్ లో కూడా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి.. ఈ సినిమాను ప్రోత్సహించాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. అవార్డ్ల కోసం తీసిన సినిమా కాదు.. వాస్తవాలను చెప్పే సినిమా అని పేర్కొన్నారు. నిజాంని పొగిడే వాళ్ళని.. సమాధికి మొక్కిన వాళ్ళను కట్టేసి ఈ సినిమా చూపెట్టాలని అన్నారు. మందు తాగే వాళ్ళుంటే ఫుల్ బాటిల్ పెట్టిమరీ ఈ సినిమా వాళ్లకు చూపెట్టాలని తెలిపారు. హిందువులను రాచి రంపాన పెట్టిన వారిని, పొగిడిన వారికి నిజాంకి పట్టిన గతే పట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లిం రిజర్వేషన్ అని.. మళ్ళీ రజాకార్ రోజులు తేవడానికి పని చేస్తున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినం జరపాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.