NTV Telugu Site icon

YS Avinash Reddy: హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి

Mp Avinash Reddy

Mp Avinash Reddy

హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు పులివెందులకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు ఎంపీ అవినాష్. ప్రతి సోమవారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ రోజు ప్రజాదర్బార్ లో వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొంటున్నట్లు కార్యకర్తలకు సమాచారం అందించారు సీఎం క్యాంప్ కార్యాలయం అధికారులు.ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనే సందిగ్థత తొలుత ఏర్పడింది. హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి…ఇవాళ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారించనుంది హైకోర్టు.

Read Also: NIA Raids: పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు..

హైకోర్టు విచారణ‌ తరువాత సీబిఐకి వస్తారా లేక ముందే వస్తారా అన్న అంశంపై ఉత్కంఠకు తెరపడింది. ..మరోవైపు హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఉంటున్న ఇంటికి ఉదయం భారీగా చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు ఆయన పులివెందులకు బయలుదేరడంతో అక్కడినించి వెనుతిరిగారు. సోమవారం అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది సుప్రీంకోర్టు.. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను నిలిపివేసింది.

తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. మరోవైపు.. జూన్‌ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును ఈ సందర్భంగా పొడిగించింది సీజేఐ ధర్మాసనం.. కాగా, ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు వైఎస్‌ సునీత.. గత శుక్రవారం ఈ పిటిషన్‌పై తొలిసారి విచారణ జరిగింది.. హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టిన సుప్రీం.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈరోజు హైకోర్ట్ లో ఏం జరగబోతోంది? సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారింది.

Read Also: NIA Raids: పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు..