NTV Telugu Site icon

YS Viveka Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జూన్‌ 5కి వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Avinash Reddy

Avinash Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఆయన ముందస్తు బెయిల్‌పై విచారణ సమయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ సాధ్యం కాదని తెలిపింది తెలంగాణ హైకోర్టు.. వాదనలు విన్నా.. తీర్పు ఇవాళ ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది.. అయితే, అత్యవసరమైతే చీఫ్‌ కోర్టును అభ్యర్థించండి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి తరపు లాయర్‌కు సూచించింది.. మొదటి వెకేషన్ కోర్టులో విచారించేందుకు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేసుకోవాలని సూచించింది హైకోర్టు సింగిల్‌ బెంచ్‌.. ఇక, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ..

Read Also: Supreme Court: హంతకులకు ఎలా తెలిసింది..? అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు..

మరోవైపు.. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దగ్గర మెన్షన్‌ చేశారు ఎంపీ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాదులు.. కానీ, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలకు నిరాకరించారు హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఇప్పటికిప్పుడు వాదనలు వినాలంటూ కోర్టు మీద ఒత్తిడి చేయొద్దు అని వ్యాఖ్యానించారు.. ఈ రోజు, రేపు, ఎల్లుండి వాదనలు వినాలని మీరు చెప్పడం సరికాదన్నారు సీజే.. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్‌ అయ్యిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీజే.. కాగా, రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఇప్పటికే ప్రకటించారు.. వెకేషన్‌ తర్వాతే తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా, తెలంగాణ హైకోర్టుకు మే 1వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి.. అయితే, మే నెలలో నాలుగు రోజులు, జూన్ 1 వ తేదీన వెకేషన్ కోర్టులు పనిచేయనున్నాయి.. 5 వెకేషన్ 5 డివిజన్ బెంచ్‌లు, 5 సింగిల్ బెంచ్‌లు పనిచేస్తాయి.. అయితే, ముందస్తు బెయిల్‌పై ఈ రోజు తీర్పు వస్తుందని ఎదురుచూసిన ఎంపీ అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. మరి, అవినాష్‌రెడ్డి వెకేషన్‌ బెంచ్‌ను ఆశ్రయిస్తారా.. ముందుస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.