NTV Telugu Site icon

MP Arvind : తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది

Dharmapuri Arvind

Dharmapuri Arvind

కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పిల్లకుంక ప్రధాని గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రధానమంత్రి మాట్లాడి మాటలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తీసుకుందని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ కాదా అని ఎంపీ అరవింద్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాణ త్యాగాలకు కారణం సోనియాగాంధీ అని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు, ఆందోళనలు జరగలేదు, అదే విషయం నరేంద్ర మోడీ చెప్పారని, కాంగ్రెస్ చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారన్నారు ఎంపీ అరవింద్‌. యువత గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడని, సిగ్గుమాలిన కుటుంబం యువత కోసం తొమ్మిదేళ్ల కాలంలో ఏం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : ODI World Cup 2023: అశ్విన్‌ను తీసుకోవడం ఏంటి?.. బీసీసీఐ సెలెక్టర్ల ప్రణాళికలు సరిగ్గా లేవు!

చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌ కూడా ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టారని, తెలంగాణలో సారా ఏరులైపారుతుందన్నారు. అంతేకాకుండా.. ఏం ముఖం పెట్టుకొని కేటీఆర్ ట్విట్లు చేస్తున్నాడని, తొమ్మిదిన్నర ఏళ్ల తెలంగాణను దరిద్రులు లూటీ చేశారన్నారు. యూనివర్సిటీలను నాశనం చేశారని, చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. కుటుంబ పాలన కేటీఆర్‌ది అని, కేటీఆర్ కుటుంబం రెచ్చగొట్టడం వల్లే చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కవిత వాళ్ళ అయ్య మీదనే ఒత్తిడి తేలేదన్నారు. కవిత ఒత్తిడి వాళ్ళ నాయనే వినలేదని, కవిత డ్రామాలు ఆపాలన్నారు. కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఏం చేశారన్నారు. కవిత వాళ్ళ నాయన చెంపలు వాయించాలని, మహిళలకు మేలు చేయాలని ఆయనపై డిమాండ్ చేయాలన్నారు.

Also Read : Ananya Panday: నాజూకు అందాలతో కుర్రకారులను కట్టిపడేస్తున్న అనన్య పాండే