MP Appalanaidu : హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబర్ లో కూడా టీడీపీ సభ్యత్వాలు జరగనున్నాయన్నారు. మే లో కడపలో టీడీపీ మహానాడు జరుగుతుందని ఆయన తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి కావడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఢిల్లీలోను లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో చర్చలు సాగిస్తూ రాష్ట్ర వృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్గదర్శి సంస్థకు సంబంధించి మిథున్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కాదని, మార్గదర్శిపై ఆయన పార్లమెంట్ లోపల, బయట తప్పు ప్రచారం చేశారన్నారు. 1995లో నా తొలి వేతనం 50వేలతో చిట్టి కట్టానని, 1996 లో చిట్టి పాడి వ్యవసాయ భూమి కొనుగోలు చేసామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి మార్గదర్శి చిట్స్ కొనసాగిస్తున్నామని, 2006 లో ఇలాగే మార్గదర్శి పై అధికార బలంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు.
Kingdom Teaser : అలసట లేని భీకర యుద్ధం.. ఎన్టీఆర్ మాటల్లో దేవరకొండ సినిమా టీజర్
అంతేకాకుండా..’అప్పట్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది మార్గదర్శి కి మద్దతుగా ర్యాలీ చేశారు. అప్పుడు ర్యాలీ చేసిన వారిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మద్దతుదారులు కూడా ఉన్నారు. 2006 లో ఆందోళన చేయడమే కాదు.. కోటి రూపాయల చిట్టీలు కట్టారు. మార్గదర్శి అంటేనే ఒక నమ్మకం. పేరుమోసిన ఈనాడు సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు చట్ట సభలను ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఇప్పటికి చాలా మంది చిన్న మొత్తంలో చిట్స్ కట్టి ఖాతాదారులుగా చేరుతున్నారు. అలాంటి ఖాతాదారులకు మీరు క్షమాపణ చెప్పాలి. మీ తండ్రి చేసిన అక్రమాలను ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం ఈనాడు చేస్తోందని కక్షకట్టి ఇలాంటి ప్రచారం చేయడం సరికాదు. ఆకాశం మీద అలిగి మీరు ఆరోపణలు చేసినట్టు ఉన్నాయి మార్గదర్శి మీద మీరు చేసే ఆరోపణలు. చిత్తూర్ సహా.. పలు జిల్లాల్లో మీరు అక్రమాలు చేసారని ఫిర్యాదులు చేస్తున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి 100ల మంది వచ్చి మీ పై ఫిర్యాదు చేస్తున్నారు. మీ తప్పులను వేలెత్తి చూపిన పత్రికలపై ఆరోపణలు చేయడం సరికాదు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో సంపాదన కొల్లగొట్టారు. అమరావతి, ఆంద్రప్రదేశ్ లో అద్భుతాలు జరుగుతాయి.. 30ఏళ్ళు తానే సీఎం అని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.’ అని ఎంపీ అప్పలనాయుడు అన్నారు.
Anji Reddy Chinnamile : కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి….