Site icon NTV Telugu

Adala Prabhakar Reddy: పార్టీ మారే ప్రసక్తే లేదు.. నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ..

Adala Prabhakar Reddy

Adala Prabhakar Reddy

Adala Prabhakar Reddy: ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఈ సారి టికెట్‌ దక్కుతుందనే నమ్మకం లేక.. పక్క చూపులు చూస్తు్న్నారు.. ఇక, వైసీపీ సీట్ల మార్పులు, చేర్పులు కాకరేపుతుండగా.. పలువురు నేతలు ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. మరికొందరు పార్టీ జంప్‌ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. నేను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. తాను పార్టీ మరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించినప్పటి నుంచి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డితో ఈ మధ్య ఆదాల భేటీ ప్రాధాన్యత సంతరించుకోగా.. ఎంపీ మాగుంటతో భేటీ మర్యాద పూర్వకమైనదేనని క్లారిటీ ఇచ్చారు. నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి ఈ సారి పోటీ చేస్తున్నానని.. పార్టీ వీడే ప్రసక్తేలేదని క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.

Read Also: Jyothula Nehru: ముద్రగడతో జ్యోతుల నెహ్రూ భేటీ.. కలిసి ప్రయాణం చేద్దాం..!

కాగా, గతంలోనూ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి.. టీడీపీ చేరతారనే ప్రచారం సాగింది.. ఆనం, కోటంరెడ్డి వంటి అధికార పార్టీ నేతలు టీడీపీలో చేరిన తర్వాత.. నెల్లూరు నుంచి మరింత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది.. ఈ క్రమంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొంతకాలం క్రితం తాను, ఆదాల ప్రభాకర రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక ఫంక్షన్ లో కలుసుకున్నప్పుడు రాజకీయ పరిస్థితులపై చాలాసేపు మాట్లాడుకున్నామని.. త్వరలోనే ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా మన పార్టీలోకి వస్తారంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కానీ, ఆదాల ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వైసీపీని వీడేది లేదు.. జగన్ నమ్మకాన్ని కాపాడుకుంటానంటూ అప్పుడే స్పష్టం చేసిన విషయం విదితమే.

Exit mobile version