నేను చంద్రబాబును కలిశానని.. పార్టీ మారుతానని కొందరు ఏడాది నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి .. ప్రతిసారి నేను క్లారిటీ ఇస్తున్నాను.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.. ఈ సారి కూడా వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి లేదా నెల్లూరు లోక్‌సభ కా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు..
మాజీ మంత్రి సోమిరెడ్డికి టికెట్ ఇస్తే మరోసారి ఓడిపోతాడంటూ జోస్యం చెప్పారు ఎంపీ ఆదాల.. నేను పార్టీ మారతాను అని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్న ఆయన.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీవిత కాలం పోరాటాలు చేసుకోవాల్సిందే.. నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ది చెయ్యడంలో ఫెయిల్ అయ్యాడని మండిపడ్డారు.