Motorola Razar 50 Ultra Launch, Price and Specs Details: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ నుంచి మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్ అయింది. రేజర్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గురువారం భారత్‌లో రిలీజ్ చేసింది. జులై 20 నుంచి అమెజాన్, రిలయన్స్ స్టోర్ సహా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. జులై 10 నుంచి ప్రీ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ రంగుల్లో లభించనుంది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫీచర్స్ అండ్ ధర వివరాలను ఓసారి చూద్దాం.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజీ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే విడుదల సందర్భంగా రూ.5,000 రాయితీ లభించనుంది. ఇక ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5,000 అదనపు రాయితీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ ఫోన్ రూ.89,999కు మీకు లభిస్తుంది. ఫోన్‌తో పాటు మోటోరొలా కంపెనీ కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను ఇస్తోంది. రిటైల్ బాక్స్‌లో ఫోన్ కేస్ కూడా ఉండడం విశేషం. ఇతర ఫోల్డబుల్ ఫోన్ బ్రాండ్లేవీ వీటిని ఇవ్వడం లేదు.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్‌తో వస్తోంది. గత వెర్షన్‌తో పోలిస్తే ఈ స్క్రీన్ పెద్దగా, సన్నగా ఉంది. ప్రధాన డిస్‌ప్లే ఫుల్‌హెచ్‌డీ+ పీఓలెడ్, 165Hz రీఫ్రెష్ రేటుతో 6.9 ఇంచెస్ పరిమాణంలో ఉంది. బయటి తెర నాలుగు ఇంచెస్ పరిమాణంలో ఎల్‌టీపీఓ, ఫ్లెక్సిబుల్ అమోలెడ్, 165Hz రీఫ్రెష్ రేటుతో వస్తోంది. ఫోన్‌ను ఫోల్డ్ చేసినప్పుడు.. వీడియోలు చూడడం, నావిగేషన్ వివరాలు, సెల్ఫీలు తీసుకోవడం లాంటి పనులు బయటి స్క్రీన్‌తోనే చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది.
Also Read: Virat Kohli: జస్ప్రీత్ బుమ్రా పిటిషన్‌పై నేను సంతకం చేస్తా: కోహ్లీ
రేజర్ 50 అల్ట్రాలో 50MP, f/1.7 ప్రధాన కెమెరా.. 50MP, f/2.0 టెలిఫొటో సెన్సర్.. 2x ఆప్టికల్ జూమ్ సెటప్‌ను ఇచ్చారు. 30X ఏఐ సూపర్ జూమ్, ఏఐ యాక్షన్ షాట్, ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్ వంటి కెమెరా ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. లోపలి డిస్‌ప్లేలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 4,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు మద్దతు ఇచ్చింది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.