Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Moto One: మోటరోలా (Motorola) మరోసారి తన వన్ (One) సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా ‘moto one’ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ వైర్ లెస్ పవర్ కన్సార్టియం (WPC) డేటాబేస్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్ డిజైన్‌తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. అయితే ఈ ఫోన్ పేరును, లాంచ్ ప్రణాళికలను మోటరోలా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ Geekbench బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్లో కూడా ఈ ఫోన్ నాలుగు సార్లు కనిపించింది. అందులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 5 చిప్సెట్తో పనిచేయనుంది. దీనికి 12GB RAM, Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గీక్ బెంచ్ పరీక్షల్లో ఈ ఫోన్ అత్యధికంగా సింగిల్ కోర్ టెస్టులో 2,109 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టులో 8,586 పాయింట్లు సాధించింది. ఇదే చిప్సెట్తో పనిచేసే ఇతర ఫోన్ల పనితీరుకు ఈ స్కోర్లు దగ్గరగా ఉన్నాయి. అయితే ఇవి ప్రీ-రిలీజ్ బెంచ్‌మార్క్ ఫలితాలు కావడంతో తుది పనితీరులో మార్పులు ఉండే అవకాశం ఉంది.
Also Read
- గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
- Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
- Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
- Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
WPC సర్టిఫికేషన్ ద్వారా ఈ ఫోన్లో 15W Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే వైర్డ్ ఛార్జింగ్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, డిస్ప్లే పరిమాణం, కెమెరా స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. మోటరోలా 2018లో One సిరీస్‌ను అప్పర్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు Snapdragon 8 Gen 5 వంటి శక్తివంతమైన ప్రాసెసర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకురానుండటం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ఫోన్ నిజంగానే One సిరీస్‌లో భాగమైతే, గతంలో కంటే ఉన్నతమైన ప్రీమియం సెగ్మెంట్లోకి ఈ సిరీస్ అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ‘moto one’ అనేది తాత్కాలిక పేరు మాత్రమే కావచ్చని కూడా సమాచారం.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
-
Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
-
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
-
Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్‌కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!