55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!

Moto Buds 2

Moto Buds 2

Moto Buds 2 Launch: భారత మార్కెట్లో మోటోరోలా (Motorola) కనెక్టెడ్ డివైజ్‌ల శ్రేణిని మరింత పెంచుతూ కొత్త మోటో బడ్స్ 2 (Moto Buds 2) ఇయర్‌ బడ్స్‌ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇటీవల విడుదలైన moto g37 సిరీస్‌తో పాటు ఈ కొత్త ఇయర్‌ బడ్స్‌ ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ప్రీమియం TWS ఇయర్‌బడ్స్‌ ను మొదటిగా MWC 2026 ఈవెంట్‌లో ఆవిష్కరించారు. తక్కువ ధరలోనే హైఎండ్ ఆడియో ఫీచర్లను అందించడం Moto Buds 2 ప్రత్యేకతగా నిలిచింది.

Bose ట్యూనింగ్‌తో ప్రీమియం ఆడియో:
Moto Buds 2లో మోటోరోలా, ప్రముఖ ఆడియో బ్రాండ్ బోస్ తో కలిసి పనిచేసింది. ఇందులో 11mm డైనమిక్ డ్రైవర్లు, 6mm కనౌల్స్ బ్యాలన్సడ్ డ్రైవర్లతో కూడిన హైబ్రిడ్ ఆడియో సెటప్‌ను అందించారు. దీని వల్ల డీప్ బాస్‌తో పాటు క్లియర్ మిడ్, హై ఫ్రీక్వెన్సీ సౌండ్ అనుభవం లభిస్తుంది. అదనంగా Hi-Res ఆడియో, LHDC లో-లేటెన్సీ కోడెక్, స్పటిల్ల్ ఆడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సినిమాలు, గేమింగ్, మ్యూజిక్ వినే సమయంలో మరింత ఇమర్శివ్ అనుభూతిని ఇవి అందిస్తాయి.

శబ్దాలకు గుడ్‌బై:
ఈ ఇయర్‌బడ్స్‌ లో గరిష్టంగా 55dB వరకు డైనమిక్ యాక్టీవ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) సపోర్ట్ ఇచ్చారు. చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి ANC ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ ద్వారా అవసరమైనప్పుడు బయట శబ్దాలు కూడా వినిపించేలా సెట్టింగ్ మార్చుకోవచ్చు. కాలింగ్ కోసం ఒక్కో బడ్‌లో మూడు చొప్పున మొత్తం ఆరు మైక్రోఫోన్లు ఇచ్చారు. ఇవి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ (ENC), క్రిస్టల్ టాక్ AI టెక్నాలజీతో కలిసి పని చేసి బ్యాక్‌ గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి క్లియర్ వాయిస్ కాల్స్ అందిస్తాయి.

AI ఫీచర్లు, స్మార్ట్ కంట్రోల్స్:
Moto Buds 2లో మోటో AI సపోర్ట్ కూడా ఉంది. దీంతో స్మార్ట్ వాయిస్ కంట్రోల్స్, అడాప్టివ్ ఆడియో ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ వేర్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా ఇయర్‌బడ్‌ను చెవి నుంచి తీస్తే మ్యూజిక్ ఆటోమేటిక్‌గా ‘పాజ్’ అవుతుంది. మళ్లీ పెట్టగానే ప్లే బ్యాక్ కొనసాగుతుంది. మోటో బడ్స్ యాప్ ద్వారా EQ సెట్టింగ్స్, ANC లెవల్స్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

భారీ బ్యాటరీ:
ఈ ఇయర్‌బడ్స్‌కు IP54 వాటర్, స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. చెమట, తేలికపాటి వర్షం, జిమ్ వర్కౌట్స్ సమయంలో కూడా ఇవి సురక్షితంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌కు IPX2 రేటింగ్ ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 11 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 53 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందుతుంది.

మోటో బడ్స్ 2లో తాజా బ్లూటూత్ 6.0 కనెక్టివిటీని అందించారు. దీని వల్ల మెరుగైన కనెక్షన్ స్టెబిలిటీ, తక్కువ లేటెన్సీ, మంచి పవర్ ఎఫిషియెన్సీ లభిస్తాయి. డ్యూయల్ డివైస్ కనెక్షన్ ఫీచర్ ద్వారా ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

ధర:
మోటో బడ్స్ 2 భారతదేశంలో మే 25 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర రూ. 2,999గా నిర్ణయించగా.. ఆఫర్లతో రూ. 2,799కే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, అలాగే ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.