Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. తాజాగా జరిగిన లేఆఫ్స్‌లో భాగంగా తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో దాదాపు 10 శాతం మందిని, అంటే సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు పంపడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో మెటా సింగపూర్ బృందాలకు చెందిన ఉద్యోగులు మొదటిగా ఈ చేదు వార్తను అందుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సింగపూర్‌లోని మెటా హబ్‌లో ఉన్న ప్రభావిత ఉద్యోగులకు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటలకు) కంపెనీ ఈమెయిల్స్ పంపింది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ.. ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ లేఆఫ్స్ రావడం గమనార్హం.
ఇలాంటి ఘటనే గతంలో మరో పెద్ద టెక్ కంపెనీ ‘ఒరాకిల్’ (Oracle) లోనూ జరిగింది. ఆ సంస్థ ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులకు ఉదయం 6 గంటలకే ఈమెయిల్స్ పంపి ఉద్యోగాల నుంచి తొలగించింది. కంపెనీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. టైమ్ జోన్ల (ఆయా దేశాల సమయాల) ఆధారంగా వేర్వేరు విడతలుగా ప్రభావిత ఉద్యోగులకు ఈమెయిల్స్ అందుతాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, బ్రిటన్, ఇతర ప్రాంతాలలోని తమ సిబ్బందిని ఈరోజు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయాల్సిందిగా మెటా కోరింది. మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ పంపిన అంతర్గత మెమో ప్రకారం.. 8,000 మంది ఉద్యోగాల కోతతో పాటు, మరో 7,000 మంది ఉద్యోగులను కొత్త ‘AI-నేటివ్’ బృందాల్లోకి బదిలీ చేయనున్నారు. అలాగే, కంపెనీలో మేనేజర్ల పాత్రలను తగ్గించి, చిన్న చిన్న బృందాలపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నట్లు జానెల్ గేల్ హింట్ ఇచ్చారు. ఈ లేఆఫ్స్ ప్రభావం ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ బృందాలపై ఎక్కువగా ఉంటుందని, ఈ ఏడాది చివర్లో మరికొన్ని తొలగింపులు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా మెటా సుమారు 6,000 ఉద్యోగ ఖాళీలను (Job Openings) సైతం రద్దు చేసింది. దీనిపై జానెల్ వివరిస్తూ.. “చాలా విభాగాలు ఇప్పుడు చిన్న చిన్న బృందాలతో (Pods/Cohorts) చాలా వేగంగా, మరింత బాధ్యతాయుతంగా పనిచేయగల దశకు చేరుకున్నాయి. దీనివల్ల మన ఉత్పాదకత పెరగడమే కాకుండా, పనిలో మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు. గత నెలలోనే ఈ 8,000 మంది ఉద్యోగాల కోతకు సంబంధించిన వార్తలు మీడియాలో లీక్ అవ్వడంతో మెటా సంస్థ దీనిని ధృవీకరించింది. అప్పటినుంచే ఉద్యోగులలో తీవ్ర అభద్రతాభావం, ఆందోళన నెలకొన్నాయి. ఉద్యోగుల నైతిక స్థైర్యం (Morale) ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఈ ప్రకటన వెలువడటానికి ముందే కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో లభించే ఉచిత స్నాక్స్, లాప్టాప్ చార్జర్లను తమతో పాటు సర్దుకోవడం ప్రారంభించారట.
మరోవైపు, మెటా సంస్థ AI శిక్షణ కోసం ఉద్యోగుల మౌస్ కదలికలను, కీబోర్డ్ కీస్ట్రోక్‌లను ట్రాక్ చేసే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందనే వార్తలు ఇటీవల బయటకు వచ్చాయి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిఘాను వెంటనే ఆపేయాలంటూ 1,000 మందికి పైగా ఉద్యోగులు ఒక పిటిషన్‌పై సంతకాలు కూడా చేశారు. గూగుల్, ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పోటీగా నిలబడాలనే లక్ష్యంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పుడు ఏఐ రంగానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకనే ఈ ఏడాది $125 బిలియన్ల నుంచి $145 బిలియన్ల వరకు ఖర్చు చేయాలని మెటా ప్లాన్ చేస్తోంది. ఇందులో సింహభాగం నిధులు AI కోసమే కేటాయించనున్నారు. కేవలం మెటా మాత్రమే కాదు.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో చాలా కంపెనీలు ఏఐపై దృష్టి పెడుతూ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. గత వారమే ‘సిస్కో’ (Cisco) సంస్థ 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా.. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఇతర దిగ్గజాలు సైతం ఇటీవల లేఆఫ్స్ ప్రకటించడం లేదా స్వచ్ఛంద రాజీనామాలు ఆఫర్ చేసింది.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!