Google Search Big Update: గూగుల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. కొత్త ఏఐ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Search Big Update: ఇంటర్నెట్ ప్రపంచంలో గూగుల్ సరికొత్త విప్లవానికి తెరలేపింది. గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ వేదికగా ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ అనేక కీలక ప్రకటనలు చేశారు. వాటిలో అత్యంత ప్రధానమైనది, మనం రోజువారీ ఉపయోగించే వెబ్ సెర్చ్‌లో గూగుల్ తీసుకురాబోతున్న సమూల మార్పులు. ఒకప్పుడు కేవలం 10 నీలిరంగు లింకులను (10 Blue Links) మాత్రమే చూపించిన గూగుల్ సెర్చ్, ఇప్పుడు వినియోగదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రంగంలోకి దించింది. ఇకపై యూజర్లు సరికొత్త ఇంటెలిజెంట్ సెర్చ్ బాక్స్‌ను చూడబోతున్నారు.
లింకుల కాలం చెల్లింది..
వెబ్ సెర్చ్ చరిత్రలోనే గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద మార్పుకు గూగుల్ శ్రీకారం చుట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ కేవలం వెబ్సైట్ లింకుల లీస్ట్‌ను మాత్రమే ప్రదర్శించదు. దానికి బదులుగా, యూజర్స్ ఏఐ ఆధారిత ఇంటరాక్టివ్ అనుభవంలోకి తీసుకువెళ్తుంది. అంటే, మీరు అడిగిన ప్రశ్నకు నేరుగా ఏఐ సమాధానాన్ని వెబ్ పేజీ రూపంలో సృష్టించి ఇస్తుంది. దీంతో పాటు యూజర్స్ తరపున ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించడానికి ‘ఇన్ఫర్మేషన్ ఏజెంట్లకు’ వీలు కల్పించే సరికొత్త సాధనాలను గూగుల్ రిలీజ్ చేస్తోంది. దీని సహాయంతో యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా మినీ – యాప్‌లను కూడా స్వయంగా సృష్టించుకోగలుగుతారు. మొత్తంగా ఈ కొత్త టూల్స్‌తో ఇకపై మనం ఇంటర్నెట్లో సమాచారాన్ని వెతికే విధానాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయని అర్థం అవుతుంది.
Also Read
- ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
- WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
- 7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
- HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
ఈ కొత్త వెబ్ సెర్చ్ బాక్స్ ద్వారా యూజర్లకు సరికొత్త అనుభూతి ఎదురుకాబోతుంది. ఈ కొత్త సెర్చ్ బాక్స్ మనుషులు మాట్లాడుకునే మాటలను, వారు అడిగే ప్రశ్నలను సైతం సులభంగా అర్థం చేసుకుంటుంది. దీనికోసం యూజర్స్ స్టార్టింగ్‌లో వేర్వేరు మోడ్‌లను ఎంచుకోవలసిన అవసరం లేదు. అలాగే ఏఐ ఆధారిత ప్రశ్న సూచన వ్యవస్థ ద్వారా యూజర్లకు సెర్చ్ చేయడం మరింత సింపుల్ కానుంది. గూగుల్ సెర్చ్ ఇప్పుడు ఏజెంటిక్ సామర్థ్యాలను, ఏఐ ఆధారిత ఇంటరాక్టివ్ ఫీచర్లను పొందుపరుస్తుండటంతో.. భవిష్యత్తులో ప్రజలు బ్ల్యూ కల్లర్ లింక్‌లపై క్లిక్ చేయడం చాలా వరకు తగ్గిపోనుంది. అయితే ఈ ఆలోచన పూర్తిగా కొత్తదేమీ కాదు. గూగుల్ 2003లోనే ‘గూగుల్ అలర్ట్స్’ను స్టార్ట్ చేసింది. ఇది సమాచారం అందిన వెంటనే ఇమెయిల్ ద్వారా పంపేది. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కారణంగా ఈ వ్యవస్థ ఊహించని స్థాయికి అభివృద్ధి చెందింది.
జెమిని, యాంటీగ్రావిటీల పవర్‌తో ఇంటరాక్టివ్ వెబ్ పేజీలు!
గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గూగుల్ పవర్ఫుల్ ఏఐ ‘జెమిని’ (Gemini) ‘గూగుల్ యాంటీగ్రావిటీ ప్లాట్‌ఫామ్’ సహాయంతో ఇకపై సెర్చ్ రిజల్ట్స్ అన్నీ లైవ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజీల వలె స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఉదాహరణకు ఎవరైనా గూగుల్‌లో ‘బ్లాక్ హోల్స్’ (Black Holes) గురించి వెతికితే.. గూగుల్ ఆ విషయాన్ని కేవలం టెక్స్ట్ రూపంలో కాకుండా, సులభంగా వివరించడానికి ఒక అద్భుతమైన ఇంటరాక్టివ్ విజువల్‌ను అక్కడికక్కడే క్రియేట్ చేస్తుంది. అంతేకాదు ఆ తర్వాత మీరు అడగబోయే తదుపరి ప్రశ్నలను అంచనా వేస్తూ వాటికి సంబంధించిన కొత్త విజువల్స్, డేటాను కూడా ముందే రెడీ చేసి ఉంచుతుంది.
తాజావార్తలు
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
-
ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
-
Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
-
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!