మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలోని శభాష్ పల్లిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రియుడిమోజులో పడి కన్న కూతురును కాటికిపంపింది కసాయి తల్లి. కడుపు తీపి లేని ఆ తల్లికి కన్నపేగు బంధానికంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని రెండేళ్ల కూతురిని కసాయి తల్లి, ప్రియుడు హత్య చేశారు. కాగా మమతకు ఐదేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన భాస్కర్ తో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక, ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ పెట్టుకుని ఇద్దరు పిలల్లతో కలిసి పుట్టింటికి వచ్చిన మమత.. అదే గ్రామానికి చెందిన ఫయాజ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Also Read:PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోడీ
ప్రియుడితో వెళ్లిపోవడానికి.. తన భర్త భాస్కర్ పురుగుల మందు తాగాడని మమత తల్లిదండ్రులను నమ్మించింది. హాస్పిటల్ కి వెళ్లి వస్తానని తన ఐదేళ్ల కొడుకుని తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి రెండేళ్ల కూతురు తను శ్రీ ని వెంట తీసుకువెళ్లి ప్రియుడితో పరార్ అయ్యింది. సాయంత్రం అల్లుడు భాస్కర్ కి మమత తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో మమత బాగోతం బయటపడింది. గతంలోనూ ప్రియుడు ఫయాజ్ తో వెళ్లిపోగా తల్లిదండ్రులు నచ్చజెప్పినట్లు తెలిపారు. చిన్నారి తను శ్రీ హత్యకు గురైందన్న వార్తతో మమత తల్లిదండ్రులు కన్నిటిపర్యంతమవుతున్నారు. దారుణానికి ఓడగట్టిన కూతురు మమతకి ఉరిశిక్ష వేయాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.
Also Read:Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ
కాగా తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఈ ఏడాది జూన్ 7వ తేదీన చిన్నారీ తను శ్రీని తల్లి మమత, ప్రియుడు ఫయాజ్ హత్య చేశారు. కూతురు మమత, మనవరాలు తను శ్రీ కనిపించడం లేదంటూ శివంపేట పోలీసులకు తండ్రి రాజు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో మమత, ఫయాజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, నరసరావుపేటలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని చిన్నారి కోసం విచారించగా అసలు విషయం బయటపడింది. ఇక, శభాష్ పల్లి శివారులో తను శ్రీ మృతదేహాన్ని పూడ్చిపెట్టామని చెప్పడంతో జేసీబీతో తవ్వగా.. కుళ్ళిన స్థితిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆ కసాయి తల్లి మమతతో పాటు ప్రియుడు ఫయాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.