NTV Telugu Site icon

Bhadradri Kothagudem District: కొడుకును దారుణంగా చంపిన తల్లి.. కారణం ఇదే…

Murder

Murder

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

READ MORE: Disha Salian: దిశా సాలియన్ ఎవరు..? హత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆదిత్య ఠాక్రేకు సంబంధం ఏమిటి..?

మరోవైపు.. ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టి హత్యకు ఒడిగట్టింది తల్లి. హత్యకు భార్య కూడా సహకరించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తల్లి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున వెంకటేష్‌ రక్తపు మడుగులో శవమై కనిపించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన

READ MORE: Off The Record: జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇక మాది దోస్త్ మేరా బంధం..