అమీన్ పూర్ లో తల్లి తన కడుపున పుట్టిన పిల్లలకు విషమిచ్చి కడతేర్చిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అమ్మతనానికి మాయని మచ్చగా రజిత అనే మహిళ ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను మృత్యుఒడికి చేర్చింది. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రజితను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి రజితతో పాటు ప్రియుడు శివను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
Also Read:PMO Office: డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై PMO ఉన్నత స్థాయి సమావేశం
ఇటీవల జరిగిన గెట్ టు గెదర్ పార్టీలో శివ అనే వ్యక్తితో రజితకు పరిచయం ఏర్పడింది. పదో తరగతి వరకు శివతో కలిసి రజిత చదువుకుంది. ఆ పరిచయం కాస్త అక్రమసంబంధానికి దారితీసింది. గత కొన్ని నెలల నుంచి శివతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది రజిత. ఈ క్రమంలో శివతో కలిసి బతకాలని రజిత ప్లాన్ చేసింది.. పెళ్లి అయి ముగ్గురు పిల్లలు ఉన్నందున తనతో ఉండేందుకు ప్రియుడు శివ నిరాకరించాడు. పిల్లల్ని చంపి వస్తే తనతో జీవించేందుకు అవకాశం ఇస్తానని శివ చెప్పాడు. పిల్లలకు పెరుగులో విషం కలిపి చంపేయాలని రజితకు సలహా ఇచ్చాడు.
Also Read:CM Chandrababu: కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక చర్చలు..
పిల్లలు చచ్చిపోతే భర్త చెన్నయ్యను పోలీసులు అరెస్టు చేస్తారని ఐడియా ఇచ్చాడు. ప్రియుడు శివ ఇచ్చిన ఐడియాతోనే ముగ్గురు పిల్లల్ని చంపి కడుపు నొప్పి నాటకం ఆడింది తల్లి రజిత. పిల్లలు ముగ్గురు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8) కూడా విగతజీవులై పడిపోయారు. భార్య రజిత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ, విచారణలో రజిత అసలు బాగోతం వెలుగుచూసింది.