Masood Azhar Died: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి..!
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మసూద్ అజార్ మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు పేలుడులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు. సోమవారం ఉదయం భవల్‌పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మార్కెట్‌లో పేలుడు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పేలుడు అనంతరం తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం పరుగులు తీస్తున్నారు. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
https://twitter.com/TimesAlgebraIND/status/1741737369840271471
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
Read Also: Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ప్రజలు కొంచెం ఓపిక పట్టండి.. అందరికి ఆరు గ్యారెంటీలు అందిస్తాం..
మసూద్ అజార్ ను విడుదల చేయించడం కోసం1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది. అంతేకాకుండా.. భారత పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు మసూదర్ అజార్ కారణం. జూలై 5, 2005న అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంపై దాడితో సహా భారత్‌పై క్రూరమైన ఉగ్రవాద దాడులకు జైషే మహ్మద్ క్యాడర్‌ను అజహర్ ఉపయోగించుకున్నాడు. జనవరి 3, 2016న ఆఫ్ఘనిస్తాన్‌లోని బాల్ఖ్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా అతను దర్శకత్వం వహించాడు. అతను అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరియు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ల సన్నిహిత సహచరుడు.
https://twitter.com/TimesAlgebraIND/status/1741734792885084525
Read Also: Journey Movie: ప్రేమలో మళ్ళీ మునిగి తేలండి.. ఆరోజే ‘జర్నీ’ రీ రిలీజ్
పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు అజహార్.. కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే వాడు. అంతేకాకుండా.. బ్రిటన్‌కు జిహదీని పరిచయం చేసింది అజహార్. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!