Site icon NTV Telugu

Dengue cases: కర్ణాటకలో 7000కు పైగా డెంగ్యూ కేసులు.. చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

Dengue Case

Dengue Case

Dengue cases: కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని.. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు.

Read Also: ACB Court: చంద్రబాబు హౌస్ రిమాండ్‌ పిటిషన్‌ విచారణలో ట్విస్ట్..! తీర్పు రేపటికి వాయిదా..

రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే 4,000 కంటే ఎక్కువ బెంగళూరు నగరంలో నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.., డెంగ్యూ కేసుల పెరుగుదలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో దోమల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతోపాటు రసాయనాలు పిచికారీ చేయడం, నీరు పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించడం, వాటిని శుభ్రం చేయడం వంటివి చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: Sana Mir: అచ్చం రష్మికలానే ఉంది.. ఈమే ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

డెంగ్యూపై భయపడవద్దు, అప్రమత్తంగా ఉండండి సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జాగ్రత్తగా ఉండాలని సీఎం అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండు రావు శుక్రవారం వ్యాధి నిఘా డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించారు. ఇందులో డెంగ్యూను సమర్థవంతంగా పర్యవేక్షించడం, నివారణ కోసం మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాష్‌బోర్డ్‌, మొబైల్‌ యాప్‌ రెండూ డెంగ్యూపైనే దృష్టి సారించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య అధికారులు మాత్రమే డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేయగలరని.. ఇది త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Exit mobile version