Dengue cases: కర్ణాటకలో 7000కు పైగా డెంగ్యూ కేసులు.. చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue cases: కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని.. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు.
Read Also: ACB Court: చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ విచారణలో ట్విస్ట్..! తీర్పు రేపటికి వాయిదా..
Also Read
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. అయితే 4,000 కంటే ఎక్కువ బెంగళూరు నగరంలో నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.., డెంగ్యూ కేసుల పెరుగుదలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో దోమల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతోపాటు రసాయనాలు పిచికారీ చేయడం, నీరు పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించడం, వాటిని శుభ్రం చేయడం వంటివి చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Sana Mir: అచ్చం రష్మికలానే ఉంది.. ఈమే ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
డెంగ్యూపై భయపడవద్దు, అప్రమత్తంగా ఉండండి సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జాగ్రత్తగా ఉండాలని సీఎం అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండు రావు శుక్రవారం వ్యాధి నిఘా డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించారు. ఇందులో డెంగ్యూను సమర్థవంతంగా పర్యవేక్షించడం, నివారణ కోసం మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాష్‌బోర్డ్, మొబైల్ యాప్ రెండూ డెంగ్యూపైనే దృష్టి సారించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య అధికారులు మాత్రమే డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేయగలరని.. ఇది త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!