Air Pollution : థాయ్‌లాండ్ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకు అక్కడ వాయు కాలుష్యం పెరుగుతూ, గాలి నాణ్యత తగ్గిపోతోంది. వాయు కాలుష్యం కారణంగా గత వారం అక్కడ దాదాపు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. రెండు లక్షల మంది ఆసుపత్రుల్లో చేరినట్లు థాయ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాహన కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే పొగ కారణంగా రాజధాని బ్యాంకాక్ లో గాలి నాణ్యత దారుణంగా క్షీణించింది. చిన్నారులు, గర్భిణులు బయటకు రావద్దని థాయ్‌లాండ్ ప్రభుత్వం హెచ్చరించింది.
Read Also: MLC Elections: ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. 4 గంటల వరకే పోలింగ్
గత మూడు రోజులుగా బ్యాంకాక్‌లోని 50 జిల్లాల్లో పీఎం 2.5 స్థాయిలు నమోదయ్యాయి.. గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి ప్రవేశించి శరీర అవయవాలకు హాని కలిగిస్తాయి.. ప్రస్తుతం దేశంలో వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలను మించిపోయింది. అందుకే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని.. బయటకు వెళ్లేటప్పుడు ఎన్95 మాస్క్‌లు ధరించాలని సూచించామని.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఎక్కువ సేపు బయటకు పంపవద్దని తల్లిదండ్రులను థాయ్ ఆరోగ్య శాఖ కోరింది.
Read Also: WTC Final: కేన్ మామ భారత్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు..
వాయు కాలుష్యాన్ని పెంచడంలో వాహన ఉద్గారాలు, పంట వ్యర్థాలను కాల్చడం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. థాయ్ లాండ్ ఉత్తరాన ఉన్న చియాంగ్ మై నగరంలో వ్యవసాయం, పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరిచే చర్యలు చేపట్టింది. జనవరి-ఫిబ్రవరిలో గాలి నాణ్యత క్షీణించినప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది.