NTV Telugu Site icon

Corona: వరుసగా ఐదవ రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు..

Corona Cases

Corona Cases

Corona: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజులుగా కేసుల సంఖ్య 10వేలు దాటుతోంది. గత వారం కాస్త అదుపులో ఉందనుకోగానే ఈ వారం భారీగా విస్తరిస్తోంది. నేడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటికేసుల సంఖ్య 70వేలు( 67,806 )కు చేరువలో ఉంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 24 గంటల్లో 29 మంది మరణించారు.

Read Also: Ashwini Choubey : కనిపిస్తే కాల్చేయాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

తాజా మరణాలతో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 5,31,329. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందిన వారే. దేశంలో ఇప్పటివరకు 4,42,92,854 మంది రోగులు మహమ్మారి బారినుంచి బయట పడ్డారు. వైరస్ నుంచి కోలుకుంటున్న రోగుల శాతం 98.66కాగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. గత నాలుగు రోజులుగా కేసులు ప్రతి రోజు 10,000 దాటుతున్నాయి.

Read Also: Road Accident: మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 22 మందికి గాయాలు..