వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులలో చేరుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతుంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) డేటా ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 30 వరకు 246 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.
Corona: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజులుగా కేసుల సంఖ్య 10వేలు దాటుతోంది. గత వారం కాస్త అదుపులో ఉందనుకోగానే ఈ వారం భారీగా విస్తరిస్తోంది.
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటికే 45 కోట్లకు పైగా టీకాలు వేసినట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ మందకోడిగా జరుగుతున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. గతంలో చెప్పిన విధంగానే జులై 31 నాటికి ఎట్టిపరిస్థితుల్లో కూడా 51 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేస్తామని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 45.7 కోట్ల డోసులు…