Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాత్రి సమయంలో కూడా ఎలాంటి అలసత్వం లేకుండా కాల్వలు, చెరువులు, రోడ్ల వంటి ప్రాధమిక వసతులను పర్యవేక్షించాలని సూచించారు.
కేవలం 5.99mm మందం, 50MP+50MP+50MP కెమెరాలు, పవర్‌ఫుల్ స్పెక్స్‌తో వచ్చేస్తున్న Motorola Edge 70..!
తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులతో పాటు, పంట నష్టంపై ఖచ్చితమైన అంచనాలు వేయాలని సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ సర్వేలు నిర్వహించడంతో పాటు, శాటిలైట్ డేటా, డ్రోన్ సర్వే వంటి టెక్నాలజీ సాధనాలను వినియోగించాలని సూచించారు. అన్ని శాఖలు తమ తమ విభాగాల నష్టాలపై నివేదికలు సిద్ధం చేసి, ప్రాథమిక అంచనాలను త్వరితగతిన కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కేంద్రం నుండి మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఫీల్డ్ అధికారులతో మాట్లాడారు. ఆయన ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల కలెక్టర్లతో తుఫాన్ తీవ్రత, వర్షపాతం, వరద ప్రవాహాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఏలేశ్వరం, బుడమేరు వంటి వాగుల ప్రవాహాలను సమీక్షించిన సీఎం, ఏలేశ్వరం రిజర్వాయరుకు రెండు రోజుల్లో 3 టీఎంసీల వరకూ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పిన నేపథ్యంలో.. వరద నియంత్రణ చర్యలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు తదితరులు తమ తమ జిల్లాల పరిస్థితులను ముఖ్యమంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. ఫీల్డ్ స్థాయిలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
Samsung Galaxy S25 Ultra: సామ్ సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై రూ. 28 వేల డిస్కౌంట్.. ఇదిగో డీల్
ఇక సచివాలయంలో మంత్రి నారా లోకేష్ తుఫాన్ పరిస్థితిపై మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా, మంత్రి నారాయణ మున్సిపాలిటీల్లో నేలకొరిగిన చెట్లను వెంటనే తొలగించాలని డ్రైనేజ్, రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సమన్వయంతో తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు, ప్రజలకు అవసరమైన సాయాన్ని అందించేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తోంది.
