Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!

Varanasi

Varanasi

Varanasi: తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి సినిమా వస్తోందంటే చాలు.. ఓటీటీ దిగ్గజాలు కోట్లు కుమ్మరించడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) సౌత్ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (VP) మోనికా షెర్గిల్ ఎన్‌టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘సూపర్ సుబ్బు’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఆమె.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ రూమర్‌పై గట్టిగా స్పందించారు.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.. రాజమౌళి మహేష్ బాబుల్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi) డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందంటూ గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఈ ఇంటర్వ్యూలో మోనికా షెర్గిల్‌కు ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై ఆమె వెంటనే క్లారిటీ ఇస్తూ..”వారణాసి సినిమాకు సంబంధించి నేను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. ఆ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంటుందని నేను ఎక్కడా, ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.” అని తేల్చి చెప్పేశారు.

దీంతో ఈ ప్రాజెక్ట్‌పై నడుస్తున్న సస్పెన్స్‌కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది. అయితే నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియన్ సినిమాలకు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే మున్ముందు ఎలాంటి డీల్స్ కుదరబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ‘సూపర్ సుబ్బు’ ప్రమోషన్స్‌తో పాటు టాలీవుడ్ భవిష్యత్తు ప్రాజెక్టులపై ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.