Site icon NTV Telugu

Cricket Australia: 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్‌ ప్రకటన.. రెండేళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్

Sophie Molineux

Sophie Molineux

క్రికెట్ ఆస్ట్రేలియా 2024-25 సీజన్ కోసం మహిళల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) రెండు సంవత్సరాల తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌కి తిరిగి వచ్చింది. గత కొన్ని సిరీస్‌లలో మోలినెక్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో కూడా, ఈ స్టార్ ఆల్ రౌండర్ అద్భుతమైన ఆట ఆడి ప్రశంసలు అందుకుంది.

రెండేళ్ల తర్వాత సోఫీ మోలినక్స్ క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్‌కు తిరిగి వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో మోలినెక్స్ అద్భుతంగా ప్రదర్శన చేసింది. ఈ సిరీస్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన కంగారూ స్టార్ ప్లేయర్.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా ఎంపికైంది. ఆమె.. వన్డే పునరాగమనంలో కూడా.. తన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. బంగ్లాదేశ్‌పై కేవలం 10 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.

Read Also: Rohit Sharma: ‘వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు..’ డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ స్పీచ్..!

మరోవైపు.. 2024-25 మహిళల జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మెగ్ లానింగ్ పేరు లేదు. వాస్తవానికి.. లానింగ్ గత ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో.. కేంద్ర కాంట్రాక్టులో లానింగ్‌కు చోటు దక్కకపోవడానికి ఇదే కారణం అని చెప్పొచ్చు.

కాగా.. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ టూర్‌లో ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మూడు వన్డేల సిరీస్‌లో కంగారూ జట్టు 3-0తో విజయం సాధించింది. ఆ తర్వాత.. టీ-20 సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం చూపించింది. తొలి టీ20లో కంగారూ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో రెండో టీ20లో ఆస్ట్రేలియా 58 పరుగుల తేడాతో, మూడో మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also: Pushpa Teaser Record: పుష్ప -2 టీజర్ ఆల్ టైం రికార్డ్.. అస్సలు తగ్గేదేలే!

Exit mobile version