భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది.
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది.
ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
క్రికెట్ ఆస్ట్రేలియా 2024-25 సీజన్ కోసం మహిళల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. సోఫీ మోలినెక్స్ (Sophie Molineux) రెండు సంవత్సరాల తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌కి తిరిగి వచ్చింది. గత కొన్ని సిరీస్‌లలో మోలినెక్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో కూడా, ఈ స్టార్ ఆల్ రౌండర్ అద్భుతమైన ఆట ఆడి ప్రశంసలు అందుకుంది.
తల్లి అనే ఈ రెండు అక్షరాల్లోనే ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమను ఈ లోకంలో ఎవరు అందించలేరు. తల్లి బిడ్డల బాంధవ్యం విడదీయరానిది. కష్టమొచ్చినా.. దుఖమొచ్చినా.. ఏం సమస్య వచ్చినా ముందుగా చెప్పుకునేది తల్లితోనే.
LIC Jeevan Labh Scheme : ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ, జీవిత రక్షణ బీమాతో పాటు ఉత్తమ రాబడిని అందిస్తుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అనేక పథకాల్లో మిలియన్ల మంది పౌరులు ఇప్పటి దాకా పెట్టుబడి పెట్టారు.
TikTok: 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో కనుమరుగైన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌తో ముంబైకి చెందిన Sky esports కంపెనీ చర్చలు జరిపింది. టిక్‌టాక్ త్వరలోనే ఇండియాకు వస్తుందని ఆ కంపెనీ సీఈవో శివనంది నిర్ధారించారు. అలాగే BGMI గేమ్ కూడా 100 శాతం తిరిగి ప్రారంభమవుతుందని శివనంది తెలిపారు. కాగా గత నెలలో Hirandandani కంపెనీతోనూ బైట్‌డ్యాన్స్ చర్చలు జరిపింది. Read…