ఆసియా కప్ 2025 ట్రోఫీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫైనల్ ముగిసి 20 రోజలు దాటినా.. ట్రోఫీ, మెడల్స్ ఛాంపియన్ భారత జట్టు చేతికి రాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ. తాజాగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నుంచి హెచ్చరిక ఇ-మెయిల్ వెళ్లినా.. నఖ్వీ తగ్గేదేలే అంటున్నాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీని తన చేతుల మీదుగానే టీమిండియాకు ఇస్తా అని మరోసారి కుండబద్దలు కొట్టాడు.
బీసీసీఐ హెచ్చరిక ఇ-మెయిల్‌పై ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్ 2025 ట్రోఫీ ముమ్మాటికీ భారతదేశానికే చెందుతుంది. నేను ఏసీసీ అధ్యక్షుడిని, నా చేతుల మీదుగానే ట్రోఫీని టీమిండియాకు అందిస్తా. భారతదేశంలో ఒక ప్రెజెంటేషన్ వేడుకను నిర్వహించుకోండి. సరిహద్దులు దాటి ట్రోఫీని పంపాలని మాత్రం ఆశించొద్దు. నా నుంచి నేరుగా ట్రోఫీని తీసుకోవడానికి ఒక భారత జట్టు ఆటగాడిని పంపాలని బీసీసీఐమీ కోరుతున్నా’ అని మోహ్సిన్ నఖ్వీ పేర్కొన్నాడు. మొత్తానికి ఆసియా కప్ 2025 ట్రోఫీని ఇస్తా అంటున్న నఖ్వీ.. టీమిండియా ప్లేయర్ ఒక్కరైనా వచ్చి తీసుకోవాలని కండిషన్ పెట్టాడు. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందింస్తుందో చూడాలి.
Also Read: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. Realme GT 8 Pro ధర, ఫీచర్స్ ఇలా!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2025 ఛాంపియన్ అయిన భారత్.. ఏసీసీ చీఫ్, పీసీబీ ఛైర్మన్ అయిన మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకొనేందుకు నిరాకరించింది. 40 నిముషాలు వెయిట్ చేసిన నఖ్వీ.. ట్రోఫీ, మెడల్స్‌ను తనతో పాటు దుబాయ్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లిపోయాడు. ఆపై ఏసీసీ కార్యాలయానికి ట్రోఫీని తీసుకెళ్లిన అతడు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రావాలని కండిషన్ పెట్టాడు. నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై ఏసీసీ ఏజీఎం సమావేశంలో బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా అధికారిక ఇ-మెయిల్ ద్వారా నఖ్వికి వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని వెంటనే అప్పగించాలని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని బీసీసీఐ హెచ్చరించింది. అయినా కూడా నఖ్వీ వెనక్కి తగ్గడం లేదు.
