200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. Realme GT 8 Pro ధర, ఫీచర్స్ ఇలా!
- జీటీ సిరీస్‌లో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్
- రియల్‌మీ జీటీ 8 ప్రో, రియల్‌మీ జీటీ 8 ఫోన్‌లు లాంచ్
- 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme GT 8 Pro, Realme GT 8 Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈరోజు రియల్‌మీ జీటీ 8 ప్రో, రియల్‌మీ జీటీ 8 ఫోన్‌లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, R1X గ్రాఫిక్స్ చిప్‌తో వచ్చాయి. బెస్ట్ కెమెరా, బిగ్ బ్యాటరీతో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. జీటీ 8, జీటీ 8 ప్రోల ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
రియల్‌మీ జీటీ 8 ప్రో, రియల్‌మీ జీటీ 8 ఫోన్‌లు 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 2K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. IP69+IP68+IP66 రేటింగ్‌లతో వచ్చాయి. రెండు ఫోన్‌లలో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ప్రో డ్యూయల్-సిమ్ సపోర్ట్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.79-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని గరిష్ట ప్రకాశం 7000 నిట్‌లు. స్క్రీన్ 144 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతాయి.

రియల్‌మీ జీటీ 8 ప్రో 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ ఎంపికలో అందుబాటులో ఉంది. అయితే రెండు ఫోన్‌ల మధ్య స్టోరేజ్ భిన్నంగా ఉంటాయి. రెండింటిలో 7000mAh బ్యాటరీ ఉంటుంది. 8 ప్రో మోడల్ 120W, 8 మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ప్రో మోడల్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 200MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 8లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. కంపెనీ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను ఇచ్చింది.

Realme GT8 12GB RAM + 256GB స్టోరేజ్ బేస్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. దీని ధర 2,899 యువాన్లు (సుమారు రూ.35,850). 16GB RAM + 1TB స్టోరేజ్‌తో వచ్చే టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర 4,099 యువాన్లు (సుమారు రూ. 50,690)గా కంపెనీ నిర్ణయించింది. ప్రో వేరియంట్ విషయానికొస్తే.. 12GB RAM + 256GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌లో వస్తుంది. దీని ధర 3,999 యువాన్లు (సుమారు రూ. 49,440). ఇక 16GB RAM + 1TB స్టోరేజ్‌తో కూడిన Realme GT8 Pro టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర 5,199 యువాన్లు (సుమారు రూ. 64,280)గా ఉంది.

తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..