మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఈ ఇయర్ లో బర్రోజ్, ఎంపురన్‌లో క్యామియోలతో సరిపెట్టేసిన హృదయం హీరో ప్రణవ్ మోహన్ లాల్ లాంగ్ గ్యాప్ తర్వాత ‘డీయస్ ఈరే’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేసాడు.
Also Read : Kaantha : కాంత తెలుగు ట్రైలర్ రిలీజ్.. దుల్కర్ నట విశ్వరూపం
మమ్ముట్టి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బ్రహ్మయుగం ఫేం రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కేరళలో రిలీజ్ అయిన ఆరు రోజులకు గాను రూ. 22 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సషన్ క్రియేట్ చేసింది. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లు కొల్లగొట్టాడు లాలెట్ట. మరోవైపు హృదయం, వర్షన్గుళిక్కు విశేషం, డీయస్ ఈరే తో బ్యాక్ టు బ్యాక్ యాబై కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు ప్రణవ్ మోహన్ లాల్. కెరీర్ మొత్తంలో చేసిన 5 సినిమాలో మూడు యాభై కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాలు ఉన్న ప్రణవ్ సరిగ్గా సినిమాలపై ఫోకస్ చేస్తే మోహన్ లాల్ జూ వచ్చినంత క్రేజ్ వస్తుంది. కానీ ప్రణవ్ రూటే సెపరేట్. ఎక్కడో స్పెయిన్‌లో గొర్రెలు, మేకలు కాస్తూ ఎంజాయ్ చేసి మళ్లీ ఇండియాలో వచ్చి హిట్ కొట్టి వెళ్తుంటాడు. అటు ఫాదర్, ఇటు సన్ ఇలా ఫాదర్ అండ్ సన్ వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్నారు.