Site icon NTV Telugu

Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు

Tollywood (1)

Tollywood (1)

విలన్‌గా మొదలై… హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సీనియర్ స్టార్… ప్రస్తుతం కెరీర్‌లో కొంత డల్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు. సైడ్ రోల్స్‌కి షిఫ్ట్ అయి సాలిడ్ కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు మోహన్ బాబు నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా “ది ప్యారడైజ్”లో మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. రగ్గడ్ లుక్, గన్, కత్తి, సిగార్‌తో ఆయన లుక్ ఇప్పటికే ఇంటెన్స్ వైబ్ క్రియేట్ చేసింది. ఈ పాత్ర కథలో కీలకమని మోహన్ బాబు నటనలో మరో కోణాన్ని చూపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ఇంకా… అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న “శ్రీనివాస మంగాపురం” సినిమాలో వెంకటప్ప నాయుడు పాత్రలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో రాషా తడానీకి తండ్రిగా కనిపించబోతున్నాడు.

Also Read : NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్

ఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యాక్షన్ హీరో డా. రాజశేఖర్… ప్రస్తుతం కెరీర్‌లో క్లియర్ రూట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. “పీఎస్వీ గరుడ వేగ” తర్వాత ఆయన నుంచి 2.0 వెర్షన్ వస్తుందని అనుకున్నా గ్రాఫ్ పడిపోవడంతో ఆగిపోయింది. జగపతిబాబు, శ్రీకాంత్‌లా విలన్ రోల్స్‌లో స్థిరపడలేకపోయాడు. అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్‌తో కనిపిస్తున్నా… పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ కావడంలేదు. 2023లో “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్”లో స్పెషల్ రోల్ తర్వాత… సరైన క్యారెక్టర్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.. లేటెస్ట్ గా శర్వానంద్ నటిస్తున్న “బైకర్” సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘బుల్లెట్ సునీల్’ అనే మాజీ మోటోక్రాస్ రేసర్‌గా… హీరోకి ట్రైనర్‌గా పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రాజశేఖర్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి… ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఈ ఇద్దరు సీనియర్ హీరోలు… ఇప్పుడు పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో మళ్లీ మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారు. మరి ఈ సినిమాలైనా మోహన్ బాబు, రాజశేఖర్‌లకు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాయేమో చూడాలి.

Exit mobile version