Russia-Ukraine: యుద్ధంలో హైదరాబాద్ యువకుడి దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (Russia-Ukraine) అమాయక భారతీయు యువకులు బలైపోతున్నారు. పలువురి ఏజెంట్ల ద్వారా మోసపోయి.. యుద్ధంలో చేరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవలే చాలా మంది భారతీయ యువకులు రష్యా యుద్ధంలో చేరినట్లు వార్తలు రాగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చేరొద్దని సూచించింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన మహ్మద్ అస్ఫాన్ (30) (Mohammed asfan) ఉద్యోగ రీత్యా రష్యా వెళ్లాడు. ఓ బట్టల షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ ఏజెంట్ ద్వారా మోసపోయి యుద్ధంలో చేరి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత డిసెంబర్ నుంచి అతని ఆచూకీ లభించలేదు. దీంతో యుద్ధంలో అస్ఫాన్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది.
Also Read
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
తాజాగా అస్ఫాన్ యుద్ధంలో చనిపోయినట్లు రష్యన్ ఎంబసీ నుంచి అధికారికంగా తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కలిసి సహాయం కోరారు. మృతదేహం హైదరాబాద్ తరలించేందుకు సహాయం కోరారు. దీంతో ఓవైసీ.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే మాస్కోలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడుతున్నారు.
పలువురు భారతీయ యువకులు ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ధనాన్ని ఆశ జూపించి యుద్ధంలోకి నెట్టేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే యుద్ధంలో చేరొద్దని యువతకు భారత ప్రభుత్వం హెచ్చరించింది.

తాజావార్తలు
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!