Site icon NTV Telugu

Modugula Venugopala Reddy: 2029 ఎన్నికలలో మొట్టమొదట గెలిచేది దేవినేని అవినాషే!

Devineni Avinash

Devineni Avinash

వైసీపీని ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకొని నడిపిస్తున్నాడని జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ ప్రశంసించారు. 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాషే అని పేర్కొన్నారు. కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గానికి కాదు, పార్టీకి కొండంత అండ అని చెప్పారు. వైఎస్ జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసిందని మోదుగుల అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూ కోడ్ ద్వారా డాక్యుమెంటరీని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ విడుదల చేశారు.

Also Read: Alluri Sitarama Raju: బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి!

‘వైసీపీని జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకొని నడిపిస్తున్నాడు. 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాష్. కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గానికి కాదు పార్టీకి కొండంత అండ. వైఎస్ జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసింది. చంద్రబాబు గెలిచాడు కానీ.. అతన్ని గెలిపించి ప్రజలు ఓడిపోయారు. విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే విధంగా కృషి చేస్తాం. రేపు అధికారంలోకి వస్తామో రామో అనే విధంగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు చేసిన తప్పుడు వాగ్దానాలు వివరించాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మమ్ములను ఇంత మోసం చేస్తున్నారా? అని ప్రజలు తెలుసుకోవాలి. మేము ఎక్కడ తిరుగుతున్నా కూటమి నేతలని తిడుతున్నారు. ‘బాబు షూరిటీ మోసం గ్యారంటీ’ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తే కూటమి నేతలు రోడ్లు మీద కూడా తిరగరు’ అని మోదుగుల అన్నారు.

Exit mobile version