ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రెండవ దశ ప్రచార పర్యటనలో భాగంగా ఈనెల 6న రాజమండ్రి, అనకాపల్లి లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.
READ MORE: Tarun : సీక్రెట్ గా మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరో .. అసలు రహస్యం బయటపెట్టిన తల్లి..
6న మధ్యాహ్నం రాజమమడ్రి పార్లమెంటుకు చేరుకుంటారు. 6న సాయంత్రం అనకాపల్లి పార్లమెంటుకు వస్తారు. కూటమిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంటుల పరిధిలో నిర్వహిచే సభలో మోడీ పాల్గొంటారు. ఈనెల 8న ఉదయం రాజంపేట పరిధిలో పీలేరు సభలో చంద్రబాబు పవన్ లతో కలిసి ప్రసంగిస్తారు. చంద్రబాబు, పవన్ తో కలిసి 8న సాయంత్రం 4 గంటలకు విజయవాడలో 2.5 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇదే.. 6న మధ్యాహ్నం 3 గంటలకు మోడీ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని వేమగిరి సభ ,రాజమండ్రి సభ అనంతరం సాయంత్రం 5:45 కు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి అనకాపల్లి పరిధిలోని కశింకోట సభలో పాల్గొంటారు. ఈనెల 8న మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. పీలేరు సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు గన్నవరానికి బయలుదేరుతారు. 5 గంటలకు గన్నవరం నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుని.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు.