మాజీ ముఖ్యమంత్రి, త్వరలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో దోపిడీ, ఇసుక మాఫియ, దేవుని భూములు కబ్జా జరిగిందని ఆరోపించారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ నాయకులు ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు అంటూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్ష కూడా చేపట్టారు. అటు హిందూపురం కేంద్రంగా జిల్లా కోసం ఆమరణ దీక్షకు…