Modi Zelensky phone call: ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్లు త్వరలో భేటీ కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీసోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఇద్దరూ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
READ MORE: KTR : అందుకే కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాటకాలు ఆపింది
“ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలపై జెలెన్స్కీతో మాట్లాడి, ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉంది. వీలైనంత త్వరగా రష్యా – ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడంపై ఇండియా స్థిరమైన వైఖరి గురించి తెలియజేశాను. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన ప్రతి సహకారాన్ని అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
భారత ప్రధాని మోడీతో కీలక అంశాలపై వివరంగా చర్చించినట్లు జెలెన్‌స్కీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంతోపాటు యుద్ధం ముగింపు వ్యవహారంలో మా భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలన్న వైఖరికి భారత్ సానుకూలంగా ఉండటం సంతోషకరం. మా నగరాలు, గ్రామాలే లక్ష్యంగా రష్యా చేపడుతున్న దాడుల గురించి ఆయనకు వివరించాను. ” అని జెలెన్స్కీ పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోడీ, తాను వ్యక్తిగత సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, పరస్పర సందర్శనలపై కృషి చేయాలని అంగీకరించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు.
READ MORE: iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: మిడ్ రేంజ్‌లో బ్యాటరీ, కెమెరా, పనితీరు.. ఎవరిదీ పైచేయి?