Modi – Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు (డిసెంబర్ 4) భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. దేశమే కాకుండా, ప్రపంచం మొత్తం కూడా ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ భేటీపై ఆసక్తి కనబరుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ తొలిసారిగా భారత్ రాబోతున్నారు. భారత్, రష్యాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు, సంతకాలు జరిగే అవకాశ ఉంది. ముఖ్యంగా చమురు, రక్షణ, వాణిజ్యంపై రెండు దేశాలు చర్చించనున్నాయి. వీటితో పాటు బ్రహ్మోస్, ఎస్-400, ఎస్-500 వ్యవస్థల కీలక ఒప్పందాలు ఉండే అవకాశం ఉంది.

Read Also: Jaish-e-Mohammad (JeM): 5000 మంది “మహిళా ఉగ్రవాదులు” రిక్రూట్.. జైషే మహ్మద్ ఆత్మాహుతి ట్రైనింగ్..
అయితే.. ఇప్పుడు మోడీ, పుతిన్‌లకు సంబంధించిన పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య 25 ఏళ్ల స్నేహం ఉంది. అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2001లో మాస్కో పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ పుతిన్ వెనక నిలుచున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో వాజ్‌పేయి బృందంలో విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌తో పాటు అప్పటి గుజరాత్ సీఎంగా మోడీ కూడా ఉన్నారు.

ఆనాడు, పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ప్రధాని వాజ్‌పేయితో కలిసి కూర్చుని ఉండగా వారి వెనకాల మోడీ నిలబడి ఉన్నారు. అయితే, ప్రస్తుత ప్రపంచంలో మోడీ, పుతిన్‌లు ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకులుగా, దేశాధినేతలుగా గుర్తింపు పొందారు. ఇద్దరూ కూడా పలు వేదికలపై ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇటీవల, చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఏకంగా పుతిన్, మోడీ కోసం 10 నిమిషాలు బయట వేచి చూశారు. ఇద్దరు కలిసి, ఒకే వాహనంలో వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.