Modi-putin: రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికాసేపట్లో భారత్‌లో ల్యాండ్ కాబోతున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్ పర్యటించనున్నారు. ఇప్పటికే, భారత ప్రభుత్వం పర్యటన కోసం అత్యున్నత ఏర్పాట్లను చేసింది. పుతిన్ రాకతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ బస చేసే హోటల్, సందర్శించే ప్రాంతాలను భారత భద్రతా అధికారులతో పాటు రష్యన్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Modi – Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు (డిసెంబర్ 4) భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. దేశమే కాకుండా, ప్రపంచం మొత్తం కూడా ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ భేటీపై ఆసక్తి కనబరుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ తొలిసారిగా భారత్ రాబోతున్నారు. భారత్, రష్యాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు, సంతకాలు జరిగే అవకాశ ఉంది. ముఖ్యంగా చమురు, రక్షణ, వాణిజ్యంపై రెండు దేశాలు చర్చించనున్నాయి. వీటితో పాటు బ్రహ్మోస్, ఎస్-400,…