రైల్వే అధికారులు, రైల్వే భద్రతా సిబ్బంది ఇటీవల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. అయినప్పటికీ, నేరస్థులు ఇప్పటికీ నేరాలు చేయడంలో మరికాస్త నైపుణ్యంతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో రైల్వే అధికారులు కూడా ఎలాంటి ఆధారాలు కనుకోలేకపోతున్నారు. రైల్వే పరిపాలనలో రైళ్లలో జరిగే నేరాలను విజయవంతంగా ఎదురుకొనేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు నేరస్తులు కూడా తెలివిగా మారుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..
ప్రయాణీకులు రైలు ఎక్కినప్పుడు, ప్రతి ఒక్కరూ సాధారణంగా విండో సీటు కోసం చూస్తారు. అలాంటి సమయంలో హాయిగా కూర్చొని ఫోన్‌లో పాటలు లేదా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కొంతమంది రైలు ఎక్కే ముందు సెల్‌ఫోన్‌లకు ఛార్జింగ్ పెడుతుంటారు. ఇకపోతే ప్రస్తుత వైరల్ వీడియోలో చూపిన ప్రయాణికుడు సరిగ్గా అదే చేశాడు. కిటికీ పక్కన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని కూర్చున్నాడు. అంతలోనే రైలు బయట స్టేషన్ లో ఉన్న ఒక దొంగ తన చేతివాటన్నీ ప్రదర్శించాడు. రైలు ప్లాట్ ఫామ్ నుండి మొదలు అవగానే కిటికీలోంచి చేయి వేసి ప్రయాణికుడి ఫోన్ దొంగిలించి పారిపోయాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే రైలు బయటకు రాలేకపోయిదు. అప్పటికే రైలు బయలుదేరింది. దీంతో పాటు పలువురు ప్రయాణికులు కూడా రైలు తలుపుల ముందు కిక్కిరిసిపోయారు.
ఇక ఈ వీడియో సోషల్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ వినియోగదారు ఖాతా ద్వారా పోస్ట్ చేయగా ఇప్పటికి 75 మిలియన్ల మంది పైగా చూశారు. 2 మిలియన్ల మంది ఈ వీడియోను లైక్ చేసారు. సోషల్ నెట్‌వర్క్ వినియోగదారులు ఈ పోస్ట్‌పై రకరకాలుగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే, పోస్ట్ డిస్క్రిప్షన్‌లోని హ్యాష్‌ట్యాగ్ వీడియో సత్నా రైల్వే స్టేషన్‌కు సంబంధించినదని సూచిస్తుంది.