Extra-Marital Affair: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. కర్రలతో దాడి చేసిన గ్రామస్థులు, 11 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra-Marital Affair: జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో దారుణం జరిగింది. తమ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది. ఈ ఘటన బొకారో జిల్లాలోని మహుటాండ్ పీఎస్ పరిధిలోని ధ్వయ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. అనంతరం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి ముస్లిమేతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గ్రామస్థులు ఆగ్రహంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు ఓ వార్డు మెంబర్ అని తెలిపారు. గురువారం జరిగిన దుర్గాదేవీ నిమజ్జనం సమయంలో ఓ వర్గానికి చెందిన 22 మంది మరో వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారు. ఫలితంగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Ravan Dahan: ఇదెక్కడి విడ్డూరం.. రావణుడి పది తలలు దగ్ధం కాలేదని గుమస్తాపై వేటు
Also Read
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడికి ధ్వయ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కొందరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి దుర్గామాత నిమజ్జనం సమయంలో అదును చూసి మూకదాడికి పాల్పడ్డారు. బాధితుడికి తీవ్ర గాయలవ్వగా.. రామ్‌ఘఢ్ ఆసుపత్రిలో పోలీసులు చేర్చారు. బాధితుడి ఆరోగ్యం విషమించడం వల్ల రాంచీలోని ఓ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసులో 22 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!