NTV Telugu Site icon

Thota Trimurthulu: జోగేశ్వరరావుది ఉనికి కోసం చేస్తున్న హడావిడి

thota 1

Collage Maker 26 Feb 2023 11.58 Am

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల ఉద్దేశపరంగానే చర్చ కోసం మైక్ ప్రకటన చేసారు ..బహిరంగ చర్చ కోసం పోలీసులకు తెలిస్తే ఊరుకుంటారా…టిడ్కో ఇళ్లు నిర్మాణంలో గత ప్రభుత్వం అవినీతి చేసి నిర్వీర్యం చేసారు. లబ్ధి దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు… ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాము…అప్పట్లో ఈ ఇల్లు నిర్మాణం ప్రైవేట్ కాంట్రాక్టర్ తో చేయించుకోవడం కోసం చంద్రబాబునాయుడుని కలిసాము..సౌకర్యవంతంగా అతి తక్కువ రేట్ కి చేసేందుకు స్కెచ్ తో సహా సిద్దం చేశాను.

చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. కలిసిన దాంట్లో జోగేశ్వరరావు లేడు అని చెప్పమనండి. కాలాపువ్వు సెంటర్లో జోగేశ్వరరావు కాళ్ళు మధ్యలో నుంచి దూరిపోతాను. ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఆనాడు టిడ్కో ఇల్లు నిర్మాణం చేశారు..ప్రస్తుతం సీఎం జగన్ ఇల్లు సౌకర్యవంతంగా నిర్మాణం చేస్తున్నారు…తన ఉనికి చాటు కోవడం కోసమే జోగేశ్వరరావు హడావుడి చేస్తున్నాడు..అతను ఉలిక్కి పడుతున్నాడు..భయం తోనే ఆర్భాటం చేస్తున్నాడు..చర్చ కోసం జనాన్ని పిలుచుకోవడం ఎందుకు అన్నారు. ఇది బలప్రదర్శన కాదు..నేను ఒక్కడినే వస్తాను. నిజంగానే టిడ్కో ఇళ్లలో రాత్రి పడుకోవాలంటే కమిషనర్ ని అడగవలసిన అవసరం ఏముందన్నారు తోట త్రిమూర్తులు.

Read Also: Pakistan: ఇంట్లో ఖరీదైన కార్లు.. చేసేది భిక్షాటన.. మోసపోయిన డాక్టర్..

మరోవైపు ఎమ్మెల్యే వేగుళ్ళకు సెక్షన్ 149 నోటీస్ లు జారీ చేశారు సీఐ శివ గణేష్. చట్టాన్ని గౌరవించి గొల్లపుంత వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కూడా ఎవ్వరూ రారని, గన్ మెన్ కూడా అక్కరలేదని, ఒక్కడినీ అయినా పంపాలని కోరారు వేగుళ్ళ. అయితే అందుకు సీఐ అంగీకరించలేదు. చట్టాలపై వున్న గౌరవంతో పోలీస్ ల విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే వేగుళ్ళ. డీఎస్పీ బాల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 150 మంది పోలీస్ బలగాలు మోహరించారు. వెంకటాయపాలెంలోనూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. మండపేట లోనూ భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. ఎమ్మెల్యే ప్రకటనతో ఉద్రిక్తతలు తగ్దాయంటున్నారు.

Read Also: RK Roja:లోకేష్ తీరు పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుంది