NTV Telugu Site icon

Tata Madhu: తన స్వార్థం కోసం నియోజవర్గ ప్రజలను అవహేళన చేశాడు.. తెల్లం వెంకట్రావుపై కీలక వ్యాఖ్యలు

Tata Madhu

Tata Madhu

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వేలాదిమంది కార్యకర్తల శ్రమ, వందల మంది నాయకుల కష్టంతో కేసీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెల్లం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఏకైక స్థానాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని.. స్థానికుడు చదువుకున్న వ్యక్తి అని ఓటు వేసి గెలిపించారని తెలిపారు. తన స్వార్థం కోసం భద్రాచలం నియోజవర్గ ప్రజలను అవహేళన చేసిన వ్యక్తి వెంకటరావు అని తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM YS Jagan: వాలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

నిన్న జరిగిన తుక్కుగూడ సభలో కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే పార్టీ ఫిరాయించిన వారిని వారి సభ్యత్వం రద్దు అయ్యే విధంగా చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని.. 24 గంటలు గడవకముందే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కండువా వేయడం జరిగిందని ఆరోపించారు. దీన్నిబట్టి మీద ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ హామీలు నీటి మీద రాతలు అని విమర్శించారు. ఐదు మండలాల ప్రజల కష్టాన్ని తొంగులో తొక్కిన వ్యక్తి వెంకట్రావు అని మండిపడ్డారు. కాబట్టి ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరించిన తాను మీ అందరిని క్షమాపణ కోరుతున్నట్లు తాతా మధు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ వెంటనే తెల్లం వెంకటరావు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Jayashankar Bhupalpally: స్వగ్రామానికి మావోయిస్టు అన్నె సంతోష్ మృతదేహం.. గ్రామంలో విషాదఛాయలు

భద్రాచలం ప్రజలు వెంకట్రావుకు సరైన బుద్ధి చెప్పాలని.. తన వ్యక్తి స్వరూపం కోసం పార్టీ మారే వేలాది మంది కార్యకర్తల శ్రమను నమ్మకాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకట్రావును క్షమించకూడదన్నారు. పార్టీ ఫిరాయించిన తెల్లం వెంకటరావు సభ్యత్వం రద్దు చేసే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఈరోజు నీకు ఎమ్మెల్యే పదవి అనేది భద్రాచలం నియోజకవర్గం ప్రజలు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఓటర్లు, కార్యకర్తలు పెట్టిన బిక్ష అని అన్నారు. వెంకట్రావు పార్టీకి చేసిన ద్రోహాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. రేపు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును నియోజకవర్గ ప్రజలు నిలదీయాలని.. భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఛీకొట్టాలన్నారు. వెంకట్రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు హాజరైన వారందరినీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామన్నారు.