NTV Telugu Site icon

Patnam Mahender Reddy: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులు

Patnam Mahender Reddy

Patnam Mahender Reddy

Patnam Mahender Reddy: బీఆర్‌ఎస్‌ మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు చేరారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి టీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షి ఆహ్వానించారు. వీరితో పాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇవాళ ఉదయం సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు.

Read Also: Mallu Bhatti Vikramarka: కేటీఆర్.. కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారు.. కుల గణన పై అసెంబ్లీలో భట్టి విక్రమార్క

ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులిదద్దరు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని కొట్టబెట్టారు. దీంతో వెనక్కి తగ్గారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.