తెలంగాణలో బీఆర్ఎస్ ప్రచారంలో ముందుంది.. ప్రతిపక్షాలు మా దరిదాపుల్లో లేరు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఉంది.. అభివృద్ధి కొనసాగాలని ప్రజలు మద్దతు ఇస్తున్నారు.. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం నడిపిస్తున్నాం.. ఎన్నికలు వస్తే 2 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించాం.. దళిత బంధు ఆపాలని కాంగ్రెస్ ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదం అని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు ఈ ఎన్నికలు.. ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎన్ని సమీకరణాలు మారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు.. రైతులు, మహిళలను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.. మైనార్టీల ఓట్లు డివైడ్ కావడం వల్ల ప్రజలకు నష్టం.. కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆట.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోంది అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.
Read Also: Tummala Nageswara Rao : మీరు ఎంతపోరాటం చేసినా గుట్టలు ఆగడంలేదు, ప్లాట్లు ఆగడం లేదు..
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతు బంధు అపాలని కాంగ్రెస్ రైతులకు దూరం అయ్యింది.. నిజాలు చెబుతూ ప్రచారంలో ముందున్నాం.. కాంగ్రెస్- బీజేపీ తరహాలో అబద్ధాలు చెప్పడం మాకు రాదు.. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ నిలిపి వేశాం.. కొందరు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారు.. పథకాల సృష్టికర్త కేసీఆర్.. మా పథకాలు కాపీ కొట్టి కాంగ్రెస్ 6 గ్యారెంటీ లు అంటోంది అని ఆమె ఆరోపించారు. గాంధీలకు గ్యారెంటీ లేదు.. వాళ్ళ గ్యారెంటీలను ప్రజలు నమ్మరు అంటూ మండిపడింది. బీసీలకు గొడ్డలిపెట్టు కాంగ్రెస్ పార్టీ.. మాది బీసీల ప్రభుత్వం.. రాజగోపాల్ ఏ పార్టీ లో ఉన్నారో, ఆయనకు క్లారిటీ లేదు.. ఆయన మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదం అని కవిత అన్నారు.
Read Also: WC 2023 Best Catches: వన్డే ప్రపంచకప్ 2023 బెస్ట్ క్యాచ్‌లు ఇవే.. గూస్ బంప్స్ పక్కా! వీడియో వైరల్
కోరుట్లలో ఎంపీ అర్వింద్ ను ఓడిస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీకి తెలంగాణలో స్కోప్ లేదు.. ప్రజల్లో ఆ పార్టీకి విశ్వసనీయత లేదు అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ పై అమాయకత్వంతో పోటీ చేయాలనుకుంటున్నారు.. కేసీఆర్ పై ఎవరు పోటీ చేసిన ఓటమి ఖాయం.. తెలంగాణను మోసం చేసిన పార్టీ బీజేపీ, వారితో కలిసే ప్రసక్తే లేదు.. కేసీఆర్ కామరెడ్డికి రావడం ఉమ్మడి జిల్లాకు ఉపయోగం.. కామరెడ్డికి కమిట్ మెంట్ తో కేసీఆర్ వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మళ్ళీ అధికారం మాదే.. వంద సీట్లతో హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం మాకు లేదు.. ఎన్నికల్లో మతకలహాలకు తావీయ వద్దు అంటూ కవిత చెప్పుకొచ్చారు.