MLC Kavitha: దూకుడు పెంచిన కవిత.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఓపెనింగ్..

  • దూకుడు పెంచిన కవిత
  • తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఓపెనింగ్
Mlc Kavitha

Mlc Kavitha

ఇటీవల ఎమ్ఎల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతం అయినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వ్యవహారం హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలో కవిత మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఓపెనింగ్ కు రెడీ అయ్యింది. ఇందిరా పార్క్ వద్ద పనిచేస్తున్న తెలంగాణ జాగృతి కార్యాలయం మూసివేయనున్నారు.

Also Read:Chiranjeevi : చిరంజీవి, అనీల్ ప్రాజెక్ట్ షూటింగ్ అప్‌డేట్..!

ఇవాళ సాయంత్రం 4.00 గంటలకు బంజారాహిల్స్ లో ఎమ్ఎల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసం పక్కన ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. పూజ అనంతరం ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి తరఫున కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై.. జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నా పై.. కొత్త కార్యాలయంలో మాట్లాడనున్నారు. కేసీఆర్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి తరఫున కవిత పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.