Site icon NTV Telugu

MLC Kavitha : మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం

Mlc Kavitha

Mlc Kavitha

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాసనమండలిలో గిరిజన సంక్షేమంపై జరిగిన లఘ చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మణిపూర్ లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని ఆమె అన్నారు. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని ఆమె ఆరోపించారు. బ్రిటీషర్లు మెదలు పెట్టింది‌‌.. బీజేపీ ఫాలో అవుతుందని, కల్యాణలక్షి, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్యలక్ష్మి పథకాలతో గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనమన్నారు. 4 లక్షల 5వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసామన్న ఎమ్మె్ల్సీ కవిత.. లక్షా యాభై వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు ద్వారా లబ్ధి చేకూరిందన్నారు.

Also Rea : Toshakhana case: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానికి మూడేళ్ల జైలు

ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి.. కేసీఆర్ సర్కార్ నినాదమని, గిరిజనులకు రూ.1336 కోట్లు కళ్యాణ లక్ష్మీ కోసం నిధులు ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే ఖర్చు చేయటానికి కేసీఆర్ 2017లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారని, ఆదివాసీ భవన్‌తో పాటు.. కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. రూ.22 కోట్లతో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించుకున్నామని, తెలంగాణకు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేంద్రం ఇవ్వటం లేదన్నారు కవిత.

Also Read : Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version