NTV Telugu Site icon

MLC Kavitha : ప్రభుత్వం లేదని చెప్పే నాయకునికి ఓటు వేస్తే ఏమి లాభం

Mlc Kavitha

Mlc Kavitha

కాటారం ప్రజా ఆశీర్వాద సభలో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాటారం‌ సభలో పాల్గోనడం నా అదృష్టమన్నారు. కాటారంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎవరికి ఎం పని చేసాడో ఆలోచించాలన్నారు. ప్రభుత్వం లేదని చెప్పే నాయకునికి ఓటు వేస్తే ఏమి లాభమన్నారు కవిత. మంథని నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి దత్తత తీసుకొనేలా 1000 కోట్లు విడుదల చేస్తానాని హామీ ఇచ్చారన్నారు. పుట్ట మధు గెలిస్తే ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ క్రమక్రమంగా పెంపు చేపడుతామన్నారు. పెండింగ్ రేషన్ కార్డులు విడుదల చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆధారం లేని కుటుంబాలకు సౌభాగ్య లక్ష్మీ పథకంలో రూ. 3000 ఇస్తామన్నారు.

Also Read : Manipur: ఇంఫాల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్..విమానాశ్రయం మూసివేత

ఇంటి పెద్ద కోల్పోతే కేసీఆర్ రక్ష 5.లక్షల బీమా పథకం అమలు చేస్తామన్నారు. రూ.15 లక్షలు ఆరోగ్య శ్రీ వర్తించే విధంగా పనిచేస్తామన్నారు. రూ‌. 1200 ఉన్న సిలెండర్.. రూ. 400 పంపిణీ చేస్తామని, అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇచ్చే విధంగా చేస్తామన్నారు కవిత. పుట్టా మధూ పేరు బులెట్ అని, పుట్టా మధును భారీ మెజార్టీ తో గెలిపిస్తే రైతు బంధు క్రమంగా 16000 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మంథని నియోజక వర్గ నాయకులకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరంట్ ఇచ్చిందన్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం ఇచ్చే విధంగా చేస్తామన్నారు. మీ హక్కుల కోసం పోరాటం చేసి పుట్టా మధును భారీ మెజార్టీ తో గెలిపించండన్నారు. యువతి,యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత.

Also Read : Mumbai: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్..

Show comments