Site icon NTV Telugu

MLC Kavitha: హరీష్‌ రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్ షూటర్‌!

Mlc Kavitha Vs Harish Rao

Mlc Kavitha Vs Harish Rao

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. హరీష్‌ రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్ షూటర్‌ అని విమర్శించారు. ఆయనే (హరీష్‌ రావు) సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారన్నారు. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్‌ రావే కారణం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్‌ రావు లేరని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు.

‘హరీష్‌ రావు, రేవంత్‌ రెడ్డి ఒకే ఫ్లైట్‌లో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు మొదలయ్యాయి. రేవంత్‌, హరీష్‌ రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు. రేవంత్‌తో హరీష్‌ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారా లేదా చెప్పండి?. హరీష్‌ రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్ షూటర్‌. ఆయనే సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌.. హరీష్‌పై ఎందుకు చేయడం లేదు. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్‌ రావే కారణం. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్‌ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్‌ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేస్తుంటే హరీష్‌ రావు వద్దన్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే నేరుగా వెళ్లి నేరుగా వైఎస్ఆర్‌ను హరీష్‌ కలవలేదా?’ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

Also Read: MLC Kavitha: సొంత చెల్లిపై కుట్రలు జరుగుతుంటే.. కేటీఆర్ స్పందించరా?

‘బీఆర్ఎస్‌ పార్టీ నాది. నేను 20 ఏళ్లుగా కష్టపడ్డా. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్ఎస్‌ పార్టీకి నేనేం చేయలేదా?. నన్ను సస్పెండ్‌ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. ఆ ఇద్దరు నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర చేశారు. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.. ఇంతకీ ఏమైంది, ఏం జరిగిందో నాకు ఫోన్‌ చేయరా అన్నా? (కేటీఆర్). నేను కూర్చొని ప్రెస్‌మీట్‌ పెడితేనే న్యాయం జరగలేదు. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా, నాకైతే అనుమానమే’ అని కవిత అన్నారు.

Exit mobile version