MLC Kavitha: హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్!
- తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం
- హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్
- రేవంత్, హరీష్ రావు కుమ్మక్కై నాపై కుట్రలు
- మామూలు మహిళా కార్యకర్తకు అన్యాయం జరిగితే స్పందిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ అని విమర్శించారు. ఆయనే (హరీష్ రావు) సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారన్నారు. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్ రావే కారణం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్ రావు లేరని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు.
‘హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్‌లో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు మొదలయ్యాయి. రేవంత్, హరీష్ రావు కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు. రేవంత్‌తో హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారా లేదా చెప్పండి?. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఆయనే సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్.. హరీష్‌పై ఎందుకు చేయడం లేదు. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్ రావే కారణం. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్ రావు వద్దన్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే నేరుగా వెళ్లి నేరుగా వైఎస్ఆర్‌ను హరీష్ కలవలేదా?’ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
Also Read: MLC Kavitha: సొంత చెల్లిపై కుట్రలు జరుగుతుంటే.. కేటీఆర్ స్పందించరా?
‘బీఆర్ఎస్ పార్టీ నాది. నేను 20 ఏళ్లుగా కష్టపడ్డా. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీకి నేనేం చేయలేదా?. నన్ను సస్పెండ్ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. ఆ ఇద్దరు నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర చేశారు. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.. ఇంతకీ ఏమైంది, ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? (కేటీఆర్). నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదు. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా, నాకైతే అనుమానమే’ అని కవిత అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!